కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటురు గ్రామంలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన వెంకటరమణ(62), కాశమ్మ(55) దంపతులు శుక్రవారం తమ ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని... ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. వీరికి నలుగురు కుమారులు ఉన్నారు.
మృతుల బంధువుల సమాచారం మేరకు ఎస్ఐ సుబ్బరామిరెడ్డి, ఏఎస్ఐ భాష సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని శవ పంచనామా కోసం మృతదేహాలను నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి పేరుతో ఉన్న ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.