కర్నూలు జిల్లా నంద్యాల మూడో పట్టణ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న హరిప్రసాద్ అనే కానిస్టేబుల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. మట్కా బీటర్లతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకున్నారు.
మూడో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని నూనెపల్లె ప్రాంతంలో కోలింపేటలో ఓ ఇంటి పై దాడి చేసిన పోలీసులు రూ.6.36 లక్షలు, ఆరుగురు మట్కా బీటర్లను ఈ నెల 13 న అరెస్టు చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన అధికారులకు కానిస్టేబుల్ హరిప్రసాద్‌కు వారితో సంబంధాలు ఉన్నట్లు తెలియగా.. ఆయన్ను సస్పెండ్ చేశారు.
ఇదీ చదవండి: