ఎన్టీఆర్ జయంతి వేడుకలు కర్నూలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. తెదేపా నేతలు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కర్నూలు..
నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు కర్నూలు నగరంలో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు.
నంద్యాల..
నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా నంద్యాలలో తెదేపా నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వృద్ధులకు అన్నదానం చేశారు. ఎన్టీఆర్ సేవలను కొనియాడారు.
ఎమ్మిగనూరు..
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను తెలుగుదేశం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగుజాతి అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు.
ఇదీ చదవండి