ETV Bharat / state

రెండో డోసు వ్యాక్సినేషన్​కు కొత్త రూల్​... ఖాళీగా టీకా కేంద్రాలు - ఆదోని తాజావార్తలు

మొదటి డోసు వ్యాక్సిన్​ వేసుకున్న తర్వాత రెండో డోసు తీసుకునేందుకు 84 రోజులు పూర్తవ్వాలనే నిబంధనలు పెట్టారు. దీంతో కర్నూలు జిల్లా ఆదోనిలో వ్యాక్సినేషన్ సెంటర్లు జనం లేక ఖాళీగా ఉన్నాయి.

vaccine center
ఖాళీగా టీకా కేంద్రం
author img

By

Published : May 18, 2021, 1:16 PM IST

కర్నూలు జిల్లా ఆదోనిలో టీకా కేంద్రాలు బోసిపోతున్నాయి. పట్టణంలోని నెహ్రూ స్మారక ఉన్నత పాఠశాలలోని వ్యాక్సిన్​ కేంద్రంలో జనం లేక వెలవెలబోయింది. ఈ కేంద్రంలో 230 మందికి టీకా వేసేందుకు నిర్ణయించారు.

ముగ్గురు వైద్య సిబ్బందితో పాటు.. భద్రత కోసం ఒక కానిస్టేబుల్​ను కేటాయించారు. కానీ మొదటిసారి టీకా తీసుకుని 84 రోజులు పూర్తయితే తప్ప.. రెండో డోసు వేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఒక్కరికి టీకా వేసే పరిస్థితి కనిపించలేదు.

ఇదీ చదవండి:

'బ్లాక్‌ ఫంగస్‌ కేసులొస్తే.. సమాచారమివ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.