ETV Bharat / state

గ్రంథాలయాలకు చేరనున్న కొత్త పుస్తకాలు - గ్రంథాలయాలకు చేరనున్న కొత్త పుస్తకాలు వార్తలు

ఎన్నో ఏళ్లుగా..పాత పుస్తకాలతో కాలం వెళ్లదీస్తున్న గ్రంథాలయాలకు మంచి రోజులు రానున్నాయి. కవులు, రచయితల సుదీర్ఘ నిరీక్షణ ఫలించనుంది. కొత్త పుస్తకాల కొనుగోళ్లకు..గ్రంథాలయ సంస్థ ముందుకు రావటంతో ప్రచురణకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గ్రంథాలయాలకు చేరనున్న కొత్త పుస్తకాలు
గ్రంథాలయాలకు చేరనున్న కొత్త పుస్తకాలు
author img

By

Published : Jan 22, 2021, 7:19 PM IST

ప్రభుత్వ గ్రంథాలయాల్లో చాలా కాలంగా పాత పుస్తకాలే దర్శనమిస్తున్నాయి. నిధుల లేమితో కొత్త పుస్తకాల కొనుగోళ్లకు సంస్థలు ముందుకు రావటం లేదు. దీంతో పాఠకులు ఉన్నవాటినే చదువుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో 2013లో చివరిసారి పుస్తకాలను కొనుగోలు చేశారు. 2016 లో పుస్తకాల ఎంపిక కోసం దరఖాస్తు చేసుకోవాలని..డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ప్రకటన విడుదల చేసింది. చాలా మంది పుస్తకాలు పంపించినా..ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. తాజాగా పుస్తకాల కొనుగోళ్లకు గ్రంథాలయ సంస్థ ముందుకు వచ్చి..నిధులు కేటాయించింది. ఫలితంగా జిల్లా గ్రంథాలయ సంస్థలకు సుమారు 40 లక్షల రూపాయలు చేరనున్నాయి.

రచయితలు, పబ్లిషర్స్ పుస్తకాల కొనుగోలు కోసం డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ గతేడాది..ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్.. వచ్చిన పుస్తకాలను పరిశీలించి ఆమోదించిన పుస్తకాల జాబితా విడుదల చేసింది. దీనినే సైటేషన్ అంటారు. తాజాగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల గ్రంథాలయ సంస్థలు..సైటేషన్ పొందిన పుస్తకాలను కొనుగోలు చేసేందుకు ప్రకటన విడుదల చేశాయి. జిల్లా కొనుగోలు కమిటీ నేతృత్వంలో త్వరలోనే పుస్తకాలను కొనుగోలు చేయనున్నారు.

విద్యార్థులకు ఉపయోగపడే పోటీ పరీక్షల పుస్తకాలు సహా నవలలు, కథలు, బాల సాహిత్యం, కవిత్వం తదితర పుస్తకాలను కొనుగోలు చేయనున్నారు. వీటిలో తెలుగు పుస్తకాలు 60 శాతం, ఆంగ్లం 25, ఉర్దూ 5, హిందీ 5, ఇతర భాషల పుస్తకాలు 5 శాతం కొనేందుకు అనుమతి వచ్చింది. పుస్తకాలు కొనడం వల్ల చాలా మంది కవులు, రచయితలకు ఆర్థిక తోడ్పాటు అందుతుంది.

నవ్యాంధ్రలో మొదటిసారి పుస్తకాలు కొనుగోలు చేస్తున్నారని..ఆలస్యం కాకుండా ఈ ప్రక్రియను పూర్తిచేసి తమను ఆదుకోవాలని కవులు, రచయితలు కోరుతున్నారు.

గ్రంథాలయాలకు చేరనున్న కొత్త పుస్తకాలు

ఇదీచదవండి

పాఠశాల విద్యార్థులతో కలిసి బస్సులో ప్రయాణించిన అనంతపురం కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.