కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఇవాళ తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 91 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 58,727 మందికి కొవిడ్ సోకగా... 57,122 మంది వైరస్‌ను జయించారు.
1125 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో.. కరోనాతో జిల్లాలో ఎవ్వరూ చనిపోలేదు. ఇప్పటి వరకు జిల్లాలో 480 మంది వైరస్‌తో చనిపోయినట్లు జిల్లా ఆరోగ్యాధికారి పేర్కొన్నారు.