కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఐదు రోజుల పాటు జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు జరుగుతున్నాయి. పోటీల్లో తలపడేందుకు పలు రాష్ట్రాల జట్లు నంద్యాలకు చేరుకున్నాయి. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించే ఈ పోటీలకు హాజరయ్యే క్రీడాకారుల పేర్లు నమోదు చేశారు. కరోనా నేపథ్యంలో క్రీడాకారులు కొవిడ్ నెగటివ్ ధ్రువీకరణ తెచ్చుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: ఘనంగా సోమేశ్వర స్వామి రథోత్సవం