కొవిడ్ మృతుల దహన సంస్కారాల కోసం ప్రభుత్వం వాగ్దానం చేసిన 15వేల రూపాయల హామీ ఏమైందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. కర్నూలులో తన తండ్రిని కోల్పోయిన మెల్బోర్న్కు చెందిన ఓ ఎన్ఆర్ఐ అంత్యక్రియల కోసం అంబులెన్స్ సిబ్బందికి 85 వేల రూపాయలు చెల్లించానని వెల్లడించిన వీడియోను ఆయన ట్వీట్ చేశారు. నకిలీ వాగ్దానాలు, అబద్ధాలను వ్యాప్తి చేసేందుకు మాత్రమే జగన్ ఉన్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.
ఇదీ చదవండీ... వైకాపా దౌర్జన్యాలకు వడ్డీతో సహా చెల్లిస్తాం : చంద్రబాబు