తమను స్వస్థలానికి చేర్చాలని కేరళలోని నంద్యాల ప్రాంత వాసులు విజ్ఞప్తి చేశారు. నంద్యాల పట్టణం కోటా వీధి, ఉప్పరిపేట, నడిగడ్డ, పోలూరు, బండి ఆత్మకూరు, పార్నపల్లె ప్రాంతాలకు చెందిన 12 మంది కేరళ రాష్ట్రంలోని మణప్పురం జిల్లా తిరూ ప్రాంతంలో పాలీష్ బండలు, టైల్స్ పనులు చేస్తూ కొన్నేళ్లుగా జీవిస్తున్నారు. నంద్యాల పట్టణానికి చెందిన మేస్త్రీ గౌస్ ఆధ్వర్యంలో అక్కడ వీరంతా ఉపాధి పొందారు. గౌస్ దిల్లీలో నిర్వహించిన జమాత్‌కు హాజరయ్యారు. దాంతో కేరళ ప్రభుత్వం గౌస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించింది. పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. అనంతరం హోం ఐసోలేషన్‌లో ఉంచింది. మిగతా వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. ప్రస్తుతం తమకు ఉపాధి లేదని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.
ఇవీ చదవండి: