ETV Bharat / state

నేటి నుంచి సాగర్‌ - శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం

నాగర్జున సాగర్​ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు తెలంగాణ పర్యటక అభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ రోజు ఉదయం 9: 30కు బయలు దేరిన లాంచీ పర్యటన పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం 3:30 కు తిరిగి వస్తుంది.

nagarjunasagar
nagarjunasagar
author img

By

Published : Nov 21, 2020, 10:24 AM IST

తెలంగాణలోని నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణానికి పర్యటక అభివృద్ధి సంస్థ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాగర్​ స్టేషన్‌ నుంచి ఉదయం 9:30 గంటలకు బయలుదేరి... 6 గంటల పాటు నీటిలో ప్రయాణించి శ్రీశైలం చేరుతుంది. అక్కడి నుంచి పర్యటక సంస్థ.. తమ బస్సుల్లో సందర్శకులను శ్రీశైలం తీసుకెళ్తుంది.

అక్కడ దర్శనీయ స్థలాలను చూపి, దైవదర్శనం చేయించి రాత్రి బస కల్పిస్తారు. తిరిగి ఆదివారం ఉదయం 9:30 గంటలకు లాంచీ.. శ్రీశైలం నుంచి బయలుదేరి సాయంత్రం 3:30 గంటలకు సాగర్‌కు చేరుతుంది. అక్కడి నుంచి పర్యటకులను బస్సు ద్వారా హైదరాబాద్ చేరుస్తారు.

ఇదీ చూడండి:

ఫిషింగ్‌ హార్బర్లు, ఆక్వా హబ్‌ల నిర్మాణానికి నేడు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.