కర్నూలు జిల్లా నంద్యాల సలింనగర్లో తెదేపా నాయకులు నూర్ బాషా , సర్దార్ బాషా అనే అన్నదమ్ములు పేద ముస్లింలకు చంద్రన్న రంజాన్ తోఫా ఇచ్చారు. రంజాన్ సందర్భంగా 200 లకు పైగా ముస్లిం కుటుంబాలకు తోఫా ఇచ్చి తమ ఉదారతను చాటుకున్నారు. సంచిపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రంతో పాటు.. స్థానిక నాయకులు చిత్రాలను ముద్రించి ఇచ్చారు. తెదేపా హయాంలోని సంప్రదాయాన్ని గుర్తుచేస్తూ తోఫా కొనసాగిస్తామన్నారు. రాబోయే రోజుల్లో తమ స్వంత నిధులతో పేద ముస్లిం ఆడ బిడ్డల పెళ్లిల్లకు ఒక్కొక్కరికి పదివేలు ఇస్తామని ప్రకటించారు.
ఇదీ చూడండి.