కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీవో కాలనీలో కేశవ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి వీపు పై రక్త గాయాలు ఉన్నాయి. మృతుడు కేశవ్ ఓ యూట్యూబ్ ఛానల్‌కు విలేకరిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
సుబ్బయ్య అనే వ్యక్తి తో పాటు, మరో వ్యక్తి కలిసి కేశవ్‌ను ఓ హోటల్ వద్దకు రమ్మని పిలిచారు. అక్కడకు వెళ్లిన వెంటనే కేశవన్ స్క్రూ డ్రైవర్‌తో పొడిచి దుండగులు హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షి ప్రతాప్ అనే వ్యక్తి తెలిపారు. సంఘటన పై పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాలు మేరకు..
సుబ్బయ్య అనే వ్యక్తి నంద్యాల రెండో పట్టణ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసేవాడు. ఇటీవల అతనిపై సస్పెన్షన్ వేటు పడింది. కానిస్టేబుల్‌కు గుట్కా వ్యాపారితో సంబంధం ఉందన్న వ్యవహారంలో ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు అతడిని విధుల నుంచి సస్పెన్షన్ చేశారు. దీనికి కారణం కేశవ్ అనిన భావించిన సదరు సస్పెండైన పోలీసు సుబ్బయ్య.. కక్షతో విలేకరిని హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
ఇదీ చదవండి:
Gunnies Record: నంద్యాల చిత్రకారుడు కొటేష్.. గిన్నిస్ రికార్డు!