కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ వద్ద సహాయకులుగా ఉండే ఏజెంట్ల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. నగర పంచాయతీ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసరావు సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన వారు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
వైకాపా, తెదేపా, భాజపాతో పాటు స్వతంత్య్ర అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించినట్లు కమిషనర్ వెల్లడించారు. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని కమినర్ వివరించారు.
ఇదీ చదవండి:
పంచలింగాల చెక్పోస్ట్ వద్ద తనిఖీలు... రూ.55 లక్షలు స్వాధీనం