ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఆ తల్లికి ఇష్టం లేదు... దీంతో దారుణమైన నిర్ణయం తీసుకుంది. ముందు తన పిల్లలకు ఉరేసి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకుంది. విచారణకు వెళ్లిన పోలీసులకు అసలు విషయాలు తెలియడంతో నిజం బయటకు వచ్చింది.
కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుళ్యం గ్రామంలో శనివారం ఉదయం.. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. మొదట అందరూ వాటర్ హీటర్ కారణంగా విద్యుత్ షాక్ తగిలిందని విషయం భావించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టం లేక.. మొదట తన పిల్లలు నిశ్చల్, వెంకట సాయిలకు ఉరేసి, తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మెుదట ఏమని చెప్పారంటే..
సతీష్, కవిత దంపతులు గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే ఈరోజు ఉదయం కూడా హీటర్‌తో నీళ్లు కాచే సమయంలో వాటర్ హీటర్‌కు ప్రమాదవశాత్తు చేయి తగలడంతో కవిత(35) విద్యుదాఘాతానికి గురైంది. పక్కనే ఉన్న చిన్నారులు నిశ్చల్ కుమార్(11), వెంకటసాయి(8) తల్లిని పట్టుకోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారని విషయం బయటకు వచ్చింది. విచారణకు వెళ్లిన పోలీసులకు తల్లే.. ఉమ్మడి కుటుంబంలో ఇష్టం లేక.. పిల్లలను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైంది.
ఇదీ చదవండి: వాటర్ హీటర్ షాక్ కొట్టి.. తల్లి, ఇద్దరు కుమారులు మృతి