కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన తల్లీ కుమారుడు తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆళ్లగడ్డకు చెందిన రామచంద్రుడు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా...జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎర్రవల్లి వద్ద 10వ బెటాలియన్ ఎదురుగా ఉన్న జాతీయ రహదారి కల్వర్టును ఢీకొట్టటంతో రామచంద్రుడు 12 నెలల కుమారుడు గౌతమ్ అక్కడిక్కక్కడే మృతి చెందాడు. అతని భార్య ప్రత్యూష కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా... రామచంద్రుడు, ఆయన కూతురు ప్రణవి చికిత్స పొందుతున్నారు.
ఇదీచదవండి