కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ మొబైల్ రైతు బజార్లను ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో.. నివారణ చర్యల్లో మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎక్కువగా మార్కెట్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే కూరగాయలను కొనుగోలు చేయాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నగరంలో 5 మొబైల్ రైతు బజార్లను అందుబాటులోకి తెచ్చామని.. త్వరలో వాటి సంఖ్యను పెంచుతామని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ డీకే బాలజీ వెల్లడించారు.
ఇదీ చదవండి: