కర్నూలు జిల్లా గడివేముల మండలం కొరటమద్ది గ్రామంలో 'మనం - మనపరిశుభ్రత' కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రారంభించారు.
పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు ప్రతిరోజు రెండు రూపాయలు చెల్లించడం ద్వారా పరిశుభ్రతపై మనకు బాధ్యతగా ఉంటుందని ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలన్నారు. మనతో పాటు మన పరిసరాలు, మన గ్రామం పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొని పలు విషయాలను ప్రజలకు వివరించారు.
ఇది చదవండి కరోనా ఎఫెక్ట్ : ఆతిథ్య రంగం వెలవెల