ETV Bharat / state

మిర్చి రైతులను కన్నీరు పెట్టిస్తున్న ఎండు తెగులు - నంద్యాలలో మిరప సాగు

పండిన పంట కోత దశలో చేజారి మిరప రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఎండు తెగులు కారణంగా దిగుబడులు తగ్గటంతో అన్నదాతలు కన్నీరుపెడుతున్నారు. మార్కెట్​లో మిర్చికి మంచి ధర ఉన్నప్పటికి.. సరైన దిగుబడి లేకపోవటం రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

mirchi losses
మిర్చి రైతులను కన్నీరు పెట్టిస్తున్న ఎండు తెగులు
author img

By

Published : Mar 20, 2021, 10:29 AM IST

మిర్చి రైతులను కన్నీరు పెట్టిస్తున్న ఎండు తెగులు

కర్నూలు జిల్లా నంద్యాల పరిధిలో గత ఏడాది ఖరీఫ్​లో సాగు చేసిన మిరపకు ప్రస్తుతం దిగుబడులు రానున్నాయి. ఎకరానికి 20 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 25 క్వింటాళ్ల మేర దిగుబడి రావాల్సిన ఉంది. కానీ ఎండు తెగులు సోకటంతో ఈ దిగుబడి.. పది క్వింటాళ్లకు పడిపొయింది.

నాణ్యత లోపంతో.. నష్టం అధికం

ఈ పంట సాగు కోసం పెట్టుబడిగా.. ఎకరాకు(కౌలుతో సహా) లక్షా యాభై రూపాయలను అన్నదాత వెచ్చించాడు. ప్రస్తుతం నాణ్యమైన మిర్చి ఒక క్వింటాకు 13 వేల రూపాయల మార్కెట్ ధర ఉంది. కానీ సరకు బాగాలేదని వంక చూపి.. క్వింటాకు అయిదువేల రూపాయల కూడా ఇవ్వటం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

యాభై శాతం మేర ఎండు తెగులు..

నంద్యాల పరిధిలో నంద్యాల, గోస్పాడులోని.. పలు మండలాల్లో ఆరువేల ఎకరాలకు పైగా మిర్చిని సాగు చేశారు. ఈ విస్తీర్ణంలోని యాభై శాతం మేర పంటకు.. ఎండు తెగులు సొకింది. కొన్ని ఏళ్లుగా ఈ పంటను సాగు చేస్తున్నామని.. ఎపుడూ ఈ పరిస్థితి రాలేదని రైతులు వాపోయారు. ప్రస్తుత ధర చూసి ఎకరానికి లక్ష రాబడిగా ఆశించామని.. అయితే లక్ష నష్టాన్ని చవి చూస్తున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ.. ఏలేరు-తాండవ కాలువల అనుసంధానానికి పాలనా అనుమతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.