Minister Jayaram meeting With His Supporters : రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తన అనుచరుల, అభిమానుల నిర్ణయం మేరకే ఎంపీ లేదా ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేస్తానని ప్రకటించారు. అభ్యర్థులకు బీఫామ్‌లు అందించేంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, ఏ క్షణంలోనైనా ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు జరగవచ్చని అన్నారు.
మంత్రి గుమ్మనూరు జయరాం కర్నూలు జిల్లాలోని ఆలూరులోని క్యాంపు కార్యాలయంలో పలు మండలాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తన రాజకీయ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తనతో ఉన్న అభిమానులకు ఆయన ధన్యావాదలు తెలిపారు. గెలుపోటములు లెక్క చేయకుండా తనతో ఉండి, తాను మంత్రి స్థాయి ఎదిగే వరకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. గత 15 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా విజయం సాధించినట్లు వివరించారు. దీనికి అనుచరుల అభిమానమే కారణమని వివరించారు.
జీవితాలతో ఆడుకుంటూ.. ఇసుక దందా చేస్తున్నారు : నారా లోకేశ్
వైఎస్సార్సీపీ అధిష్టానం నిర్ణయం ప్రకారం తనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం లభించిందని సమావేశంలో కార్యకర్తలతో వివరించారు. ఎంపీగా పోటీ చేయడానికి మద్దతు కావాలని తన అనుచరులు, కార్యకర్తలను కోరారు. ఎంపీగా పోటీ చేయమంటేనే చేస్తానని, లేకపోతే ఎమ్మెల్యే స్థానంలోనే ఉండి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని వివరించారు.
అభిమానంతో దిల్లీకి పంపిస్తే వెళ్తానని, లేదంటే కార్యకర్తలను కాదని ఏమీ చేయనని వివరించారు. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉందని, ఏ సమయంలోనైనా పోటీ చేసే అభ్యర్థుల స్థానంలో మార్పు జరగవచ్చన్నారు. తాను ఎంపీగా పోటీ చేయడం వద్దని కార్యకర్తలు అంటే, ఎంపీ అభ్యర్థి నుంచి తప్పుకుని ఆలూరు ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని వివరించారు. ఏ స్థానంలో పోటీ చేయాలన్నది కార్యకర్తలు, తన అనుచరులు, పార్టీ శ్రేణులే నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యకర్తల నిర్ణయం మేరకే ముందుకు వెళ్తానని వారికి వివరించారు.
రైతుల భూములుంటే.. ప్రస్తుత ధరతో, వారికే ఇచ్చేస్తా..! : మంత్రి గుమ్మనూరు
ఎమ్మెల్యే సీటుకోసం ఎంత దూరానికైనా వెళ్తాం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మంత్రి జయరాం అనుచరులు ఆయన వాఖ్యలపై స్పందిస్తూ జయరాం అనే వ్యక్తి ఉంటే ఆలూరు ఎమ్మెల్యేగానే ఉండాలని ఆయనను కోరారు. ఆలూరు ఎమ్మెల్యే స్థానంకో తాము మరో నాయకుడ్ని ఊహించుకోలేమని ఆయనతో తేల్చి చేప్పారు. దీనికోసం తాము ఎంత దూరానికైనా వెళ్తామని ఆయనకు వివరించారు. దీనిపై నియోజకవర్గంలోని కార్యకర్తల సమావేశం నిర్వహించుకుంటామని, అధిష్టానంతో పోరాటానికైనా సిద్ధమని మంత్రి జయరాం అనుచరులు స్పష్టం చేశారు.
సమాధానం చెప్పండి.. గడప గడపకు కార్యక్రమంలో మంత్రిని ప్రశ్నించిన ప్రజలు