ETV Bharat / state

Minister jairam: 'తాగేందుకు ముఖ్యమంత్రి డబ్బు ఇవ్వలేదంటున్నారు..' - illegal allegations on minister jairam

తాగేవాడిని తాగొద్దు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని, కుటుంబాలు దెబ్బతింటాయి అని చెబితే‘.. అన్ని పథకాల కింద ముఖ్యమంత్రి డబ్బు ఇస్తున్నారు కానీ, తాగేందుకు డబ్బు ఇవ్వడం లేదు’ అని అంటున్నారని.. తాగేవారిని మనం మార్చలేమని మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యలు చేశారు.

minister jairam
మంత్రి గుమ్మనూరు జయరాం
author img

By

Published : Sep 9, 2021, 10:15 AM IST

‘‘తాగేవాడిని తాగొద్దు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని, కుటుంబాలు దెబ్బతింటాయి అని చెబితే ‘అన్ని పథకాల కింద ముఖ్యమంత్రి డబ్బు ఇస్తున్నారు కానీ, తాగేందుకు డబ్బు ఇవ్వడం లేదు’ అని అంటున్నారు. ఈ తాగేవాడిని మనం మార్చలేం’’...అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు.

‘నా దురదృష్టం ఏమిటంటే నా నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉంది. అర కిలోమీటరు దూరంలో ఉన్న అక్కడి నుంచి మద్యం తెచ్చుకుని తాగుతారు. మద్యం ఏరులై పారుతోంది అంటే నేనేం చేయాలి? అదే పనిగా కాచుకుని ఉంటామా! ’అని పేర్కొన్నారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ‘ఇసుక ట్రాక్టర్లు వదలాలని ఎస్సైని బెదిరించారని మీపై వచ్చిన ఆరోపణలపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారా? అని విలేకరులు అడగ్గా.. మంత్రి జయరాం స్పందిస్తూ ఈ విషయం సీఎంకు తెలియదన్నారు. ‘దందాగిరి చేసేందుకు నేనేం వీరప్పన్‌లా ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు స్మగ్లింగ్‌ చేశానా? మట్టి తోలుకున్నాక తిరిగొస్తున్న ఖాళీ ట్రాక్టర్లను ఎస్సై ఆపితే అవి రైతులవి వదిలేయమని చెప్పిన మాట వాస్తవమే. నేను ఎక్కడైనా ఏయ్‌ ఎస్సై! ఇసుక ట్రాక్టర్లను వదలండి అని చెప్పి ఉంటే నాది తప్పు అవుతుంది. అడ్డదారిన మంత్రి అయిన లోకేశ్‌ నాపై విమర్శలు చేస్తున్నారు. ట్వీట్‌లు కాదు ధైర్యం ఉంటే బహిరంగంగా ఆయన చర్చకు వస్తే నేనూ మాట్లాడతా...’ అని మంత్రి జయరాం సవాల్‌ చేశారు. మంత్రిగా మీపై వచ్చిన ఆరోపణలను సీఎం దృష్టికి తీసుకువెళ్లలేదా అని అడగ్గా..‘అది పెద్ద సమస్యే కాదు. మా శాఖకు సంబంధించిన పనులు, మా వద్ద కష్టపడిన కార్యకర్తలకు పోస్టు కోసం మాట్లాడాను...’ అని ఆయన సమాధానమిచ్చారు.

ఇదీ చదవండి:

minister gummanuru jayaram: మంత్రినని ఆలోచించను... నేనే ధర్నాలో కూర్చుంటా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.