కర్నూలు జిల్లా పంచాయితీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైకాపా గెలుస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాలో ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు, నియెజకవర్గ ఇన్‌చార్జీలతో.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. జిల్లాలో అధికార పార్టీ తరఫున సర్పంచ్ పదవులకు పోటీ చేయాలని నాయకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారన్నారు. ఈక్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య మనస్పర్థలు ఉన్నాయని వాటిపై చర్చించామని చెప్పారు. నాయకుల మధ్య సమన్వయం తీసుకువచ్చి ఎన్నికల్లో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
విపక్షాలపై ఎక్కడా దాడి జరగలేదు
పంచాయితీ ఎన్నికల్లో విపక్షాలపై ఎక్కడా దాడి జరగలేదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైకాపా అభ్యర్థిని నామినేషన్ వేయ్యనివ్వకుండా.. తెదేపా నేతలు దాడి చేశారని చెప్పారు. గత ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన మండలల్లో ఎంపీడీఓలను మార్చాలని.. సీఎస్‌కు ఎన్నికల కమిషనర్ లేఖ రాయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వమైనా... ఎన్నికల కమిషన్ అయినా చట్టానికి లోబడి విధులు నిర్వహించాలన్నారు. జగ్గయ్య పేటలో ఓవ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఎన్నికల కమిషనర్ ప్రత్యక్షంగా వెళ్లడం ఏంటని మంత్రి బొత్స ప్రశ్నించారు.
ఇదీ చదవండి: