వైద్య ఆరోగ్యశాఖలో నూతన సంస్కరణలు ప్రవేశ పెడుతున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అందులో భాగంగా ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గానికి వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోనిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో భూములను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వం నిర్ణయం అన్నారు. పరిశోధనా స్థానాన్ని తరలించాల్సి వస్తే మరోచోట భూమిని కేటాయిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో 605 కరోనా కేసులు... 10 మంది మృతి