కర్నూలులోని పలు కాలనీల్లో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు ధర్నా చేపట్టారు. నగరంలోని బీ.టీ.ఆర్.నగర్, గణేష్ నగర్ 2, మమతానగర్ లలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాలనీల్లో వర్షపు నీరు నిలిచి ఉన్న కారణంగా.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువలను నిర్మించాలని వారు కోరారు.
ఇవీ చూడండి: