కర్నూలు సమీపంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన 70 సంవత్సరాల చెంచురెడ్డి కరోనా అనుమానంతో కర్నూలు ఆసుపత్రికి వచ్చాడు. నాగులాపురం వద్దనున్న విశ్వభారతి కొవిడ్ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారని మృతుడి కుమారుడు తెలిపారు. విశ్వభారతి ఆసుపత్రికి తీసుకెళితే అక్కడినుంచి కర్నూలుకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు తెలిపారని పేర్కొన్నారు. ఇక్కడికి రాగానే ఆసుపత్రి ఆవరణలోనే చనిపోయాడని.. ఉదయమే చికిత్స చేసి ఉంటే తన తండ్రి బతికి ఉండేవాడని మృతుడి కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు.
ఇదీ చదవండి బంధువుల పెళ్లికి వచ్చి అనంతలోకాలకు