కర్నూలు జిల్లా పాణ్యంలో ఇసుక లభించడం లేదని పరమేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. బలపనూరు గ్రామానికి చెందిన పరమేశ్వర్ రెడ్డి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇసుక లభించకపోవటంతో 40 వేలు పెట్టి బ్లాక్ లో ఇసుకను కొనుగోలు చేశాడు. ఇసుక సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇసుక లభించకపోవటం కారణంగా సెల్ టవర్ ఎక్కినట్లు గుర్తించిన స్థానికులు అతన్ని బుజ్జగించి కిందికి దించారు.
ఇదీ చదవండి