కర్నూల్ జిల్లా బేతంచేర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ మద్దిలేటి స్వామి ఆలయంలో ప్రతి శనివారం భక్తులు రద్దీ ఏక్కువగా ఉంటుంది. అదే రోజు భక్తుల సెల్ఫోన్లు చోరీలకు గురవుతున్నాయి. ఈ మేరకు బేతంచేర్ల పోలీస్ స్టేషన్లో భక్తులు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగలోకి దిగి శనివారం దేవస్థానం పరిధిలో నిఘా పెట్టారు. ఒకరిని అనుమానంతో పట్టుకుని విచారించగా ఐదు మంది దొంగలు దొరికారు. వీరు డోన్ పట్టణంలోనీ కొండపేటకు చెందిన షేక్ ఖాదర్బాషా, మౌలాలి, ప్రసన్న కుమార్, బాషాలుగా గుర్తించారు. వీరి నుంచి ఒక లక్ష 80 వేల రూపాయల విలువచేసే 49 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఇదీ చదవండి ఇంటి ముందు.. 'కరోనా రేపురా' అంటూ బోర్డులు..!