కర్నూలులోని జనసేన పార్టీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. స్థానిక గణేశ్ నగర్లోని పార్టీ కార్యాలయానికి ఇవాళ ఉదయం వెళ్లిన కొంతమంది.. కార్యాలయ సిబ్బందిని బెదిరించి బయటకు పంపించారు. అనంతరం కార్యాలయంలో ఉన్న సామగ్రిని బయట పడేసి తాళాలు వేసుకొని వెళ్లిపోయారు.
దీంతో సమాచారం అందుకున్న జనసేన నాయకులు, కార్యకర్తలు.. కార్యాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. భవనానికి సంబంధించి 5 ఏళ్ల అగ్రిమెంట్ ఉందని.. ప్రతీ నెల అద్దె చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటన గురించి తమకు ఎం తెలియదని ఇంటి యజమాని అన్నారు. ప్రభుత్వమే ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆరోపించిన జనసేన నాయకులు.. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: Gas Price Hike: గ్యాస్ 'ధరల మంట'... ఏయే జిల్లాలో ఎంతంటే..!