కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్డౌన్ వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు లాక్డౌన్ పాటించని కారణంగా రహదారులు రద్దీగా మారాయి. పోలీసుల జోక్యంతో దుకాణాలు మూసివేశారు. రైతు బజార్కి వచ్చే ప్రజలు చేతులు శుభ్రం చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు బోసిపోయింది. ఆర్టీసీ బస్సులను నిలిపివేసిన కారణంగా.. బస్టాండ్ నిర్మానుష్యంగా మారింది. పట్టణంలో ఉన్న 108 బస్సులు డిపోలకే పరమతమయ్యాయి.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు
బనగానపల్లెలో లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిపివేశారు. ప్రజలు ప్రధాన వీధులు దినసరి మార్కెట్లలో నిత్యవసర వస్తువుల కోసం దుకాణాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇదే అదునుగా భావించిన కొంతమంది వ్యాపారస్తులు అధిక ధరలకు కూరగాయలు అమ్ముతున్నారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ధరలు తగ్గించే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
అధిక ధరలకు అమ్ముతున్నారు
నందికొట్కూరులోని రైతు బజార్లలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఉగాదిని పురస్కరించుకొని కూరగాయలు కొనుగోలు చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పట్టణానికి చేరుకున్నారు. గత వారం కంటే ఈవారం కూరగాయల ధరలు భారీగా పెరిగాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: