ETV Bharat / state

నిబంధనలు పక్కనపెట్టి బయటకి వచ్చారో! ​

author img

By

Published : Mar 25, 2020, 12:00 AM IST

కర్నాలు జిల్లాలో లాక్​డౌన్​ కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పలుచోట్ల 144 సెక్షన్​ విధించారు. ఎవరైన రోడ్ల పైకి వస్తే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్
కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న లాక్​డౌన్

అత్యవసర సమయంలో తప్ప ప్రజలు బయటకు రాకూడదని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. కర్నూలు జిల్లాలో పలు చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్లును మూసివేశారు.

144 సెక్షన్​ అమలు

లాక్​డౌన్​ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పట్టణంలో ప్రజలు గుంపులుగా లేకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. నిత్యవసర వస్తువుల ధరలు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు అమ్మాలని స్థానిక ఆర్డీవో రామకృష్ణారెడ్డి ఆదేశించారు.

దుకాణాలు మూసివేత

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 144 సెక్షన్ విధించారు. పట్టణంలోని దుకాణాలను, హోటళ్లను మూసివేశారు. నిత్యావసర దుకాణాలు, కూరగాయల మార్కెట్లు అందుబాటులో ఉండటంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం రహదారులపై ప్రజలు తిరగకుండా పోలీసులు కట్టడి చేయటంతో పట్టణం బోసిపోయింది.

నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంటాయి

కర్నూలులో లాక్​డౌన్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలో అన్ని రహదారులను పోలీసులు నిలిపివేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారిని మాత్రమే వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. కిరాణ, మెడికల్ షాపులు తప్ప అన్ని వ్యాపార సముదాయాలు ముసివేశారు.

ఇళ్లకే పరిమితమైన ప్రజలు

కర్నూలు జిల్లా పాణ్యంలో అధికారుల ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలు చేశారు. పట్టణంలోని పలు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేసి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. జాతీయ రహదారిపై వాహన రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులను ఇళ్ల నుంచి బయటకు రావద్దని అవగాహన కల్పిస్తున్నారు.

బ్యారికేడ్ల ఏర్పాటు

కర్నూలు జిల్లా ఆదోనిలో లాక్​డౌన్​ కొనసాగుతుంది. పుర ప్రజలు కర్ఫ్యూ పాటించకంపోవటంతో రహదారులు రద్దీగా మారాయి. ప్రధాన కూడళ్లు వద్ద పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బెంగళూర్ నుంచి పట్టణంలోకి వచ్చిన వ్యక్తి దగ్గుతుంటంతో స్థానికులు వాలంటీర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసిన అనంతరం ఆ వ్యక్తికి టీబీ ఉన్నట్లు నిర్ధరించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే దెబ్బలే

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రకటించిన లాక్​డౌన్ ఆంక్షలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లా ఆదోనిలో డీఎస్పీ రామకృష్ణ స్వయంగా రంగంలోకి దిగారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్డుపైకి వస్తున్న వారిని అడ్డుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆదోని శివారు బైపాస్ రహదారిలో వాహనాలు భారీగా రావటంతో వారిపై పోలీసులు లాటి ఛార్జ్ చేశారు.

ఇదీ చూడండి: కరోనాకు కంచెతో అడ్డుకట్ట..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.