కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నకడబూరు గ్రామ సమీపంలోని పొలాల్లో సంచరిస్తున్న రెండు చిరుతపులులను స్థానికులు గుర్తించారు. గ్రామానికి చెందిన వీరేశ్.. కుటుంబ సభ్యులతో కలిసి కొండ సమీపంలోని తన పొలంలో వేరుశనగ పంటను తూర్పారపట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పొలంలో చిరుతలు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులంతా శబ్దాలు చేస్తూ వాటిని వెంబడించగా.. సమీపంలోని కొండల్లోకి వెళ్లిపోయాయి.
ఇదీ చదవండి..
Amaravathi farmers: మహా పాదయాత్రకు అపూర్వ మద్దతు.. ఇవాళ 11 కి.మీ