కర్నూలు జిల్లా దొర్నిపాడు తహసీల్దార్ కార్యాలయంలో చోరీ జరిగింది. దొంగలు కార్యాలయంలోని బీరువాలు పగలగొట్టి అందులోని భూమి రికార్డులను చెల్లాచెదురుగా పడేసి...కొన్ని గ్రామాల రికార్డులను ఎత్తుకెళ్లారు. వీటితోపాటు 16 బ్యాటరీలను దొంగిలించారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: సాంబారు పాత్రలో చెయ్యి పెట్టిన చిన్నారికి గాయాలు