ETV Bharat / state

Yoga Day Special: ఆంగ్ల అక్షరాలు, అంకెల రూపంలో.. యువతి ఆసనాలు! - అంతర్జాతీయ యోగా దినోత్సవం

ప్రస్తుత యాంత్రిక జీవనంలో... ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద సవాలే. వ్యాయామం, మంచి ఆహారంతో రోగాలకు దూరంగా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అదే సమయంలో యోగా ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. యోగా సాధనతో కరోనా వంటి భయంకరమైన వైరస్‌లను దరిచేరనీయకుండా జాగ్రత్త పడొచ్చంటున్నారు. అలాంటి యోగాకు మరింత గుర్తింపును తెచ్చేందుకు కర్నూలు యువతి ప్రయత్నిస్తోంది. యోగాలో ఆమె చేస్తున్నవినూత్న సాధనపై అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.

Prasanna excelling in yoga
ప్రసన్న
author img

By

Published : Jun 21, 2021, 8:01 AM IST

యోగాలో రాణిస్తున్న యువతి ...ఆంగ్ల అక్షరాలు, అంకెల రూపంలో ఆసనాలు

రకరకాల ఆసనాలతో ఆకట్టుకుంటున్న ఈ యువతి పేరు ప్రసన్న. కర్నూలుకు చెందిన ప్రసన్న.. ఆరో తరగతిలోనే యోగాపై ఆసక్తి పెంచుకుంది. ఓ గురువు వద్ద ఓనమాలు నేర్చుకుని క్రమం తప్పకుండా సాధనతో యోగాపై పట్టుసాధించింది. ఏడాదిలోనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని విశేషమైన ప్రతిభ కనబరిచి ఎన్నో పతకాలు సొంతం చేసుకుంది. యోగాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలనే తలంపుతో ఆంగ్ల అక్షరాలు, అంకెలను యోగాసనాల ద్వారా వేస్తోంది. యోగా ప్రాధాన్యతను తెలియజేయాలన్న ఉద్దేశంతో... భరతనాట్యానికి మిళితం చేసి.. 101 ఆసనాలు వేస్తోంది. కేవలం 13 నిముషాల వ్యవధిలోనే 100 కుపైగా ఆసనాలు వేస్తూ ప్రశంసలు అందుకుంటోంది.

కర్నూలు నగరంలో జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రసన్న యోగాసనాలు లేకుండా కార్యక్రమం జరగదంటే అతిశయోక్తి కాదు. జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఈటీవీ ప్లస్ ఛానల్ నిర్వహించిన స్టూడెంట్ నంబర్ 1 అనే కార్యక్రమంలో... అద్భుత ప్రతిభను కనబరిచి మొదటి స్థానంలో నిలిచింది. చిన్నారులకు యోగా పాఠాలు నేర్పుతోంది. యోగా సాధన ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని... కరోనా లాంటి జబ్బులకు దూరంగా ఉండొచ్చని ప్రసన్న చెబుతోంది. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు సాధిస్తానంటున్న ప్రస్నన్న.. యోగలో ఉన్నత శిఖరాలు అందించాలన్నదే తన లక్ష్యమంటోంది.

ఇదీ చదవండి:

Office timings: ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.