రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని తెదేపా కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వైకాపా ప్రభుత్వ తీరుకు నిరసనగా కర్నూలులో శనివారం ధర్నా చేపట్టారు. దేవుళ్లతో పెట్టకోవడం మంచిది కాదని ఆయన హితవు పలికారు. తెదేపాని చూసి వైకాపా నేతలు భయపడుతున్నారు కాబట్టే.. రామతీర్థం వెళ్లకుండా చంద్రబాబును అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు.
ఇదీ చదవండి: