కరోనా కేసులతో కర్నూలు జిల్లా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ధైర్యం చెప్పారు. కొవిడ్ ఆసుపత్రిలో బాధితులకు కల్పిస్తున్న వసతులపై ఆయన వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నందున పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని... పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందించడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తే కొవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీచదవండి.