మొదటి విడతగా కర్నూలు జిల్లాలోని 35, 470 మంది ఆరోగ్య కార్యకర్తలకు కరోనా టీకా వేయనున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. 147 కేంద్రాలను సిద్ధం చేయగా.. రేపు 27 చోట్ల ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. డీఎంహెచ్వో కార్యాలయం ఆవరణలోని కొవిడ్ వ్యాక్సిన్ నిల్వ కేంద్రాన్ని, జీజీహెచ్ ఓల్డ్ గైనిక్ ఓపి సెంటర్లోని టీకా కేంద్రాన్ని పరిశీలించారు. రెండవ విడతలో పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ శాఖలకు.. మూడవ దశలో సాధారణ ప్రజలు, 50 ఏళ్లు పైబడిన, ఇతర జబ్బులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇస్తామన్నారు. కోవిన్ యాప్ ద్వారా నమోదు చేసుకున్నవారికే టీకా అందిస్తామని స్పష్టం చేశారు.
కొవిడ్ టీకా వేసేందుకు కర్నూలులో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. టీకా కేంద్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ డీకే బాలాజీ పరిశీలించారు. మొదటి దశలో ఆరోగ్య సిబ్బందికి మాత్రమే వాక్సిన్ వేస్తున్నామని.. రెండవ దశలో మిగిలిన వారికి టీకా అందిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: