కర్నూలులో...
కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే ప్రజలు తమ ఓటుహక్కును వినియెగించుకొనేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, పార్లమెంట్ మాజీ సభ్యురాలు బుట్టారేణుకా, కర్నూలు నగర పాలక సంస్థ వైకాపా మేయర్ అభ్యర్థి బీవై. రామయ్య తమ ఓటు హక్కును వినియెగించుకున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో మెుత్తం 52 వార్డులు ఉండగా.. రెండు వార్డులు ఏకగ్రీవం కాగా.. 50 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఆదోనిలో...
కర్నూలు జిల్లా ఆదోనిలో పురపాలక ఎన్నికలు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది .ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించడానికి కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పట్టణంలో 33 వార్డుల్లో 115 కేంద్రంలో పోలింగ్ జరగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
నంద్యాలలో...
నంద్యాల పుర పాలక ఎన్నికల సంఘ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. 42 వార్డులకు 12 ఏకగ్రీవం కాగా.. 30 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కుని వినియోగించుకునేందుకు.. ఓటర్లు భారీగా తరలివస్తున్నారు.
ఎమ్మిగనూరులో...
ఎమ్మిగనూరులో మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు.. ఓటర్లు బారులు తీరారు. సొగనూరు రహదారి, లక్ష్మీపేట, ఎంబీ చర్చ్ తదితర పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా లైన్లలలో నిలబడ్డారు.
డోన్‌లో...
డోన్ మునిసిపలిటీలో 32 వార్డులకు గాను 25 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 7 వార్డులకు నేడు పోలింగ్ జరుగుతుంది. 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: మున్సిపల్ పోలింగ్ : బారులు తీరిన ఓటర్లు.. అన్ని ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు