కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పర్యటించారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డితో కలిసి వక్కిలేరు వాగును పరిశీలించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో రెండు రోజులుగా సగటున 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. సమాచారం అందుకున్న కలెక్టర్ ఈ ప్రాంతాలలో పర్యటించారు.
పర్యటనలో భాగంగా ఆళ్లగడ్డలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను పురపాలక కమిషనర్ రమేష్‌బాబును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పురపాలిక పరిధిలోని చింతకుంటలో ఒకటి...., ఆళ్లగడ్డ పట్టణానికి రుద్రవరం నుంచి వచ్చిన ఓ బాలికకు పాజిటివ్ వచ్చినట్లు వివరించారు. ఈమేరకు పట్టణంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కమిషనర్‌కు కలెక్టర్ ఆదేశించారు.