ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో మార్చి 4 నుంచి 14 వరకు జరిగే... శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సమీక్ష నిర్వహించారు. సునయన ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో... జిల్లా, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.
కొవిడ్-19 ను దృష్టిలో ఉంచుకొని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 11వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాన్యాస రుద్రాభిషేక లింగోద్భవం, రాత్రి పాగాలంకరణ, కల్యాణోత్సవం, గ్రామోత్సవం, రథోత్సవం తదితర అన్ని ఉత్సవాలను సంప్రదాయం ప్రకారం, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: