Balakrishnan fans honored singer Karimullah: వీర సింహారెడ్డి సినిమాలో జై బాలయ్య పాటను పాడే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని సింగర్ కరీముల్లా అన్నారు. బాలకృష్ణ సినిమాలో పాట పాడినందుకు కర్నూలు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు కరీముల్లాను ఘనంగా సన్మానించారు. సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న బాలకృష్ణ నూతన చిత్రం వీరసింహారెడ్డి సినిమాలో జై బాలయ్య పాటను కరిముల్లా ఆలపించారు. ఈ పాట విడుదలైనప్పటి నుంచి తనకు ఎంతో గుర్తింపు వచ్చిందని కరీముల్లా అన్నారు. వీర సింహారెడ్డి సినిమాలో పాట పాడే అవకాశం కల్పించిన సంగీత దర్శకుడు తమన్కు, హీరో బాలకృష్ణకు కరీముల్లా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు జగన్, లతీఫ్, శ్రీనాథ్ సింగ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: