ETV Bharat / state

పీఎం అవార్డుల ప్రజెంటేషన్‌కు కలెక్టర్‌ ఎంపిక - collector veera pandiyan latest news

ప్రైమ్ మినిష్టర్ ఇన్నోవేటివ్ అవార్డు ఎంపికకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మెుదటి స్థానంలో నిలిచారు. కేంద్ర ప్రభుత్వం పాలన సంస్కరణలు, సిబ్బంది, పబ్లిక్ గ్రీవియన్స్ శాఖ ద్వారా ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాతక్మక పీఎం అవార్డును అందిస్తున్నారు.

kurnool collector veera pandiyan
కర్నూలు కలెక్టర్ వీరపాండియన్
author img

By

Published : Sep 5, 2020, 7:15 AM IST

ప్రధానమంత్రి అవార్డ్స్‌ ఫర్‌ ఎక్సలెన్సీ-2020 అవార్డు ఎంపికకుగాను ఇన్నోవేటివ్‌ (సృజనాత్మకత) కింద 9 అంశాలను ప్రస్తావిస్తూ కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ పీఎం అవార్డులకు ప్రతిపాదనలు పంపారు. అందులో తడకనపల్లెలోని పశువుల వసతిగృహం అనే అంశం ఎంపికైంది. ఈమేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పాలనా సంస్కరణల శాఖ డైరెక్టర్‌ సతీష్‌ కె.జాదవ్‌ రాసిన లేఖను ఈ.మెయిల్‌ ద్వారా శుక్రవారం కలెక్టర్‌ అందుకున్నారు. పీఎం అవార్డుల ప్రజెంటేషన్‌కు రాష్ట్రంలో కర్నూలు కలెక్టర్‌ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. దేశవ్యాప్తంగా 12 మంది కలెక్టర్లు ఎంపికవగా ఏపీ నుంచి కర్నూలు కలెక్టర్‌ ఒక్కరే ఎంపికయ్యారు. ఎంపిక జాబితాలో వీరపాండియన్‌ పేరు ప్రథమ స్థానంలో ఉంది. పీఎం అవార్డుల ఎంపికకు కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి బృందం ప్రాథమిక కమిటీ ఈనెల 9వ తేదీన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనుంది. జిల్లా కేంద్రం నుంచి 9వ తేదీ ఉదయం 10 గంటలకు వీడియో, వెబ్‌ కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్‌ జీవనోపాదుల కార్యక్రమం కింద కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో పొదుపు మహిళలు నిర్వహిస్తున్న పశువుల వసతిగృహంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇందులో ఎంపికైతే ఆయనకు పీఎం అవార్డు దక్కనుంది. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు డీఆర్‌డీఏ, మార్కెటింగ్‌, భూగర్భ జల వనరుల శాఖకు మూడు ప్రతిష్టాత్మక స్కోచ్‌ అవార్డులు వచ్చాయి. కలెక్టర్‌కు పీఎం అవార్డుల్లో మొదటి స్థానం రావాలని ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రవి పట్టన్‌శెట్టి, రాంసుందర్‌ రెడ్డి, ఖాజా మొహిద్దీన్‌, జిల్లా అధికారుల సంఘం, పలు శాఖల అధికారులు ఆకాంక్షించారు. 2019లో ప్రధాని మాతృ వందన పథకంపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా పీఎం అవార్డు అందుకున్నారు.

జిల్లా పౌరసరఫరాల అధికారిగా సయ్యద్‌ యాసిన్‌

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో ఉప సంచాలకులుగా పనిచేస్తున్న సయ్యద్‌ యాసిన్‌ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిగా నియమితులయ్యారు. ప్రస్తుతం జిల్లా పౌరసరఫరాల అధికారిణిగా పనిచేస్తున్న పద్మశ్రీని గుంటూరు జిల్లా డీఎస్‌వోగా బదిలీ చేశారు. అర్బన్‌ ఏఎస్‌వోగా పనిచేస్తున్న రఘురామిరెడ్డిని పదోన్నతిపై అనంతపురం జిల్లా పౌరసరఫరాల అధికారిగా నియమించారు. సయ్యద్‌ యాసిన్‌ కర్నూలు వాసే.

ఇదీ చదవండి: సచివాలయ ఉద్యోగిపై వైకాపా నాయకుడి దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.