విధులకు ఆలస్యంగా హాజరైనందుకు ఓ సీఐపై కర్నూలు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. కర్నూలు ముడో టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి సొంత పని నిమిత్తం రెండు రోజులు సెలవుపై వెళ్లారు. ఈక్రమంలో శనివారం ఉదయం విధులకు హజరుకావాల్సి ఉండగా.... మధ్యాహ్నం వచ్చారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లింది. సీఐని విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ముడో టౌన్ సీఐగా ఓబులేసును నియమించారు.
ఇదీ చదవండి: