Protest for Cremation Ground : తమ గ్రామంలోని శ్మశాన వాటిక స్థలం కబ్జాకు గురికాకుండా చూడాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కొత్త బోదెపాడు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని 90 సెంట్ల శ్మశాన వాటిక భూమిని డీలర్ అయ్యన్న అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. శ్మశాన వాటికను కబ్జాదారుల నుంచి విడిపించాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
"ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అదే శ్మశానాన్ని అంత్యక్రియలకు వినియోగించుకుంటున్నాము. 2010 నుంచి డీలర్ అయ్యన్న ఈ స్థలం తనది అంటున్నాడు. మేము ఎమ్మార్వోను కలిస్తే ఆయన మాకు సహకరించటం లేదు. చివరికి ఆర్డీవోను కలిశాము. ఆయన మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు." - బోదెపాడు గ్రామస్థుడు
ఇవీ చదవండి: