కర్నూలు జిల్లా నందవరం మండలంలోని పూలచింత వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల చేసిన దాడుల్లో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. అదే మండలంలోని కనకవీడు పేటకు చెందిన లింగమూర్తి, లింగన్న, బోయ నారాయణ, వడ్డే లక్ష్మన్న ద్విచక్ర వాహనంపై మద్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. మద్యంతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: 'వైద్య కళాశాలను మరో చోట నిర్మించండి'