అరవై ఐయిదు ఏళ్లు దాటిన వారందరికి కరోనా పరీక్షలు పెద్ద సంఖ్యలో చేయ్యాలని హెల్త్ స్పెషల్ సీ.ఎస్ డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి కర్నూలు, అనంతపురం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన కరోనా కట్టడి చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జూన్ మాసంలో కరోనా కేసులు గరిష్ఠ స్థాయికి పెరుగుతాయని కోవిడ్-19 నిపుణులు అంచనా వేస్తున్నారని స్పష్టం చేశారు. అందువల్ల జిల్లాల్లో ఆస్థాయికి తగ్గట్లు టెస్టులు, ఆసుపత్రులు, ఐసీయూ, వెంటిలేటర్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఈకార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ వీర పాండియన్, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పాల్గొన్నారు.