ETV Bharat / state

'పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ జీవో' - జీవో నంబర్ 2430 తాజా న్యూస్

ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో (2430)ను వెంటనే రద్దు చేయాలని... జర్నలిస్టులు, తెదేపా శ్రేణులు, సీపీఐ నాయకులు ధర్నా చేశారు. మీడియాకు సంకెళ్లు వేయటం అమానుషమని నినాదాలు చేశారు.

జీవో 2430 పై జర్నలిస్టు సంఘాల ధర్నా
author img

By

Published : Nov 2, 2019, 11:53 PM IST

'పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వ జీవో'

పత్రికా స్వేచ్ఛను హరించే (2430) జీవోను వెంటనే రద్దు చేయాలని... జర్నలిస్టులు పలుచోట్ల ఆందోళనలు చేశారు. అనంతపురం ప్రస్​క్లబ్​లో మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో రౌండ్​టేబుల్ సమావేశం నిర్వహించారు. స్వార్ధంతోనే ముఖ్యమంత్రి ఈ జీవోను తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖర​రెడ్డి ఈ తరహాలోనే చేస్తే... జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం గుర్తుచేశారు.

పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన 2430 జీవోని ఉపసంహరించుకోవాలని... ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ధర్నా నిర్వహించారు. ప్రశ్నించే హక్కును కాలరాసేలా ఉన్న జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మీడియాపై ఆంక్షలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమని జర్నలిస్ట్ సంఘాల నేతలు పేర్కొన్నారు.

మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్న జీవోను వెంటనే రద్దు చేయాలని సీపీఐ, ఏఐఎస్​ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతినగర్ సర్కిల్ వద్ద జరిగిన ధర్నాలో జీవో పత్రాలు కాల్చివేశారు.

ఇదీ చూడండి... దిల్లీలో పోలీసులకు లాయర్లకు మధ్య ఘర్షణ

Intro:ATP :- పత్రికా స్వేచ్ఛను హరించే 2430 జీవోను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతపురంలోని ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టు సంఘాల తో ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి మాట్లాడారు.

Body:ఇతర పత్రికలను నగదు కాలని ఒక కక్షపూరిత స్వార్థంతోనే ముఖ్యమంత్రి ఈ జీవన ప్రవేశ పెట్టారని మండిపడ్డారు. ఆనాడు వైయస్ రాజశేఖర్రెడ్డి ఈ తరహాలోనే చేస్తే జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అని గుర్తు చేశారు. ప్రస్తుతం అమర్ లాంటి జర్నలిస్టులు ఇలాంటి విషయాలను వెనకేసుకు రావడం వారి స్వార్థపూరిత ధోరణికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా జీవోను వెంటనే రద్దు చేయాలని లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

బైట్.... కాల్వ శ్రీనివాసులు, మాజీ మంత్రి అనంతపురం జిల్లా

Conclusion:ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.