కర్నూలు జిల్లా నంద్యాల ఎస్సార్బీసీ కాలనీలోని కొవిడ్ క్వారంటైన్ కేంద్రాన్ని జేసీ మనిజిర్ జిలాని సామున్ సందర్శించారు. కొవిడ్ బాధితులు ఉండే గదులను పరిశీలించిన ఆయన.. పలు గదుల్లో బెడ్లు లేవని గుర్తించారు. వెంటనే సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రోగుల సమస్యలు తెలుసుకున్నారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటోందని.. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అంతకుముందు కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన జెర్మెన్ షెడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు నంద్యాస సబ్ కలెక్టర్ కల్పనా కుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: