ETV Bharat / state

8న జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: నాదెండ్ల

నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల కేంద్రంలో ఈనెల 8న జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తొలి విడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 130 మంది కౌలు రైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ సాయం అందిస్తారన్నారు.

ఈనెల 8న కర్నూలు జిల్లాలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర

author img

By

Published : May 2, 2022, 6:25 PM IST

Updated : May 2, 2022, 8:07 PM IST

ఈనెల 8న నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల కేంద్రంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో యాత్ర చేపడతున్నట్లు చెప్పారు. తొలి విడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతు కుటుంబాలకు ప్రతి ఒక్కరికీ రూ.లక్ష చొప్పున పవన్ కళ్యాణ్ సాయం అందిస్తారన్నారు. ఎనిమిదో తేదీ ఉదయం 9.30 గంటలకు పవన్ ఉమ్మడి కర్నూలు జిల్లా రానున్నారని.. శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ సభ నిర్వహిస్తారని తెలిపారు. రెండో విడతలో మిగిలిన వారికి సాయం అందిస్తారని చెప్పారు.

కౌలు రైతులకు ఆర్థికంగా సాయపడే ఈ గొప్ప కార్యక్రమం గురించి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ప్రతి రైతుకీ తెలియజేయాలని నాదెండ్ల సూచించారు. జనసేన అధినేత పవన్​పై చౌకబారు విమర్శలు మాని రైతులకు సాయం అందించే పనిపై దృష్టిపెట్టాలని రాష్ట్ర మంత్రులు సూచించారు. రైతు భరోసా యాత్ర రైతులకు కొండంత నమ్మకాన్ని కలిగిస్తున్న విషయాన్ని గ్రహించే.. వైకాపా నేతలు చౌకబారు విమర్శలకు దిగుతున్నారన్నారు. పవన్ కౌలు రైతు భరోసా యాత్ర మొదలు పెట్టగానే అదరాబాదరాగా బాధిత రైతు కుటుంబాల ఖాతాల్లో రూ.లక్ష వేస్తున్నారని.. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వారికి రూ.7 లక్షల సాయం అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: Rape Attempt: విజయవాడలో బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం

Last Updated : May 2, 2022, 8:07 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.