పంట నష్టం జరిగిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కర్నూలులో జనసేన నేతలు ఒక్కరోజు దీక్ష చేపట్టారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అన్నదాతలకు మద్దతుగా దీక్షలు చేశారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు తక్షణమే ఆర్థిక సహాయం చేయాలని కోరారు. నివేదికలు వచ్చిన తరువాత మరో రూ.35వేలు సాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'సీనియర్ వైద్యులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోంది'