కర్నూలు జిల్లాలో 910 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పాత వీధి లైట్ల వాడకం కారణంగా కరెంటు బిల్లులు తడిసిమోపెడవుతున్నాయని భావించిన ప్రభుత్వం... అన్ని గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థతో 2017లో ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటి వరకు 689 గ్రామ పంచాయితీల్లో లక్షా 55 వేలా 5 వందల ఎల్ఈడీ లైట్లను అమర్చారు. వీటిని అమర్చి సుమారు ఏడాది కావస్తోంది.
నిరంతరం వెలుగులు
పాత వీధి లైట్ల కంటే ఎల్ఈడీ బల్బులు వెలుతురు బాగానే ఇస్తున్నప్పటికీ... సమస్యలు తెస్తున్నాయి. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా... నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయి. వీటిని ఆర్పాలంటే సెంట్రలైజ్డ్ కంట్రోల్ అండ్ మానిటరింగ్ సిస్టం బాక్సులు ఏర్పాటు చేయాలి. కానీ చాలా చోట్ల ఇవి లేవు. కొన్ని బాక్సులు మరమ్మతులకు గరయ్యాయి. మరోవైపు ఎల్ఏడీ వీధి దీపాల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని చోట్ల వీధి లైట్లు పనిచేయటం లేదు.
తడసిమోపెడవుతున్న కరెంట్ బిల్లులు
ఒక్కో వీధి దీపానికి మూడు నెలలకు 150 రూపాయల రూపాయల చొప్పున నిర్వహణ ఖర్చుల కోసం ఈఈఎస్ఎల్ సంస్థకు చెల్లించాలి. ఇప్పటి వరకు 1,55,500 దీపాలకు ఏడాదికి గాను సుమారు 9 కోట్ల 33 లక్షల రూపాయలు బకాయి ఉంది. విద్యుత్ బిల్లులు సైతం 250 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ సమస్యపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు తెలిపారు. త్వరలోనే పరిష్కారం చూపుతామని చెబుతున్నారు.
ఇదీ చదవండి