కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణ శివారులోని ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు. గుత్తి ప్రధాన రహదారిని ఆనుకుని స్థానిక రైతులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఇవీ చదవండి: శ్రీశైలం జలాశయానికి భారీ వరద... పది గేట్లు ఎత్తివేత